నా బ్లాగులోని వ్యంగ్య చిత్రాలన్నీ వివిధ దినపత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.కార్టూన్లని ఇష్టపడేవాళ్ళ కోసం అన్నిటినీ ఒకేచోట చేర్చాలనే చిన్ని ప్రయత్నమే ఈ సేకరణలు.
సమావేసాలకు బాబు రావట్లేదు, దేవేందర్ రాజీనామా చేశాడు. సభలో టి అర్ ఎస్ బలం తగ్గింది. మజ్లిస్, సి పి ఐ లు మనవైపాయె! సి పి ఎం ని సస్పెండ్ చేస్తే సరి సార్! సందర్భం: మీకోసం యాత్రలో ఉన్న చంద్రబాబు.
నేను రెడీ! త్వరగా ఏదొకటి తేల్చండయ్యా! నేనసలే ఆగలేకపోతున్నాను. సందర్భం: అమెరికాతో అణుచర్చల విషయంలో యుపిఏ ముందడుగు వేస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని వామపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఎట్టి పరిస్థితులలోను వెనకడుగు వేసేది లేదని ప్రధాని ప్రకటించారు. దాంతో కేంద్ర ప్రభుత్వానికి మద్యంతర ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అద్వానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బిజెపి 2009లో జరగబోయే ఎన్నికలకు ముందుగానే ఆరుగురు అభ్యర్థులని ప్రకటించింది.
సందర్భం: ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఒక శీర్షిక తమని కించపరిచేలా ఉందని క్రిష్ణ మాదిగ అనుచరులు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసారు. దీనికి ప్రతిగా నిరసన తెలుపుతూ క్రిష్ణ మాదిగ దిష్టిబొమ్మని తగులబెట్టి చెప్పులతో కొట్టడాన్ని నేరంగా పేర్కోంటూ పోలీసులు అంధ్రజ్యోతి పాత్రికేయులని అరెస్టు చేసారు.