Thursday, July 31, 2008

కూటముల కాలం


సీబీఐ కొత్త డైరెక్టర్

సీబీఐ పదవి అంటే మాటలు కాదు.నేరగాడు నేరగాడుకాదని తేలేదాక దర్యాప్తు చేయాలి తెలిసిందా!

గృహరుణాల దెబ్బ


చౌకబారు సవాళ్ళు

బియ్యం పరిశీలన అన్నారుగా నాగం వచ్చారు సార్!

Monday, July 28, 2008

కరెంటు తీగల మీద బట్టలు

చంద్రబాబే సార్! కరెంటు తీగల మీద బట్టలారేసుకుంటున్నాడు.

రాహులు రాజకీయ ప్రతిభ


మాయ ఖతాలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

అదంతా వ్యవసాయం మీద వచ్చిన ఆదాయమట సార్! రాజకీయ వ్యవసాయం చేస్తారట ఆమె.

Sunday, July 27, 2008

బెంగుళూరు పేలుళ్ళు

ఇవన్నీ పాతబడ్డాయి సార్, నిన్నటి పేలుళ్ళకి కొత్తగా మరేదైనా కనిపెట్టాలి.

ఉగ్రవాదం


Saturday, July 26, 2008

వానా! వానా! వల్లప్పా!!

అది వరుణ యాగం వల్ల కురుస్తుంది, ఇది మేఘమధనం తాలూకు వాన,అటుది అల్ప పీడన వర్షం,ఇటుపక్కన రుతుపవనాల వాన సార్!

విజయ చిహ్నానికి అర్థం ఇదా!

సందర్భం:
విజయానికి గుర్తుగా రెండు వేళ్ళు పైకెత్తి చూపించటం మన చంద్రబాబుకి అలవాటు.తాజాగా జరిగిన విశ్వాస పరీక్షలో తెదేపాకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటెయ్యటం కాకతాళీయమే!

మీకోసం


కాంగ్రెస్ వ్యతిరేఖ కూటమి

ఆ బీజేపీ మాత్రం ఏం పాపం చేసుకుంది కామ్రెడ్!దాన్ని కూడా కలుపుకుని కాంగ్రెస్‌ని ఓడిస్తే పోలా!!

Friday, July 25, 2008

హామీలలో కొత్తదనం


ఎంపీలూ! దొంగలొస్తారు జాగ్రత్త!

ఇంద క్రాస్ ఓట్లు వేసినవారి జాబితా...ఏ ఇంటికి ముందెళ్దాం.

Thursday, July 24, 2008

చంద్రబాబు కొత్త వ్యాపారం

సందర్భం:
కేంద్రంలో అన్ని పార్టీలను కలిపి కూటములు కట్టడంలో బాబు సిద్ధహస్తుడే!ఇంతకముందు ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్, ఎన్‌డీఏలలో ఆయన పాత్ర కీలకం.ఇప్పుడు కూడా మరొక కూటమి కట్టడంలో విజయం సాధించినా, సొంత పార్టీ ఎంపీలే వ్యతిరేకంగా ఓటెయ్యడం కొసమెరుపు.

వర్షంతో బాబుకున్న బంధమేంటో!

రాష్ట్రక్షేమం కోరి కొన్నాళ్ళపాటు డిల్లీలోనే ఉండమని మంత్రి బొత్స ఫోన్ సార్!
సందర్భం:
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు రాష్ట్రంలో పెద్దగా వర్షాలు పడేవి కాదు.రాజశేఖర రెడ్డి అధికారంలోకొచ్చినప్పటినుంచి వర్షాలు బానే పడేవి.కానీ, ఈ సంవత్సరం వర్షాభావం ఏర్పడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితుల వల్ల వారం రోజుల నుంచి బాబు డిల్లీలోనే ఉన్నారు.ఈవారం రోజులు ఋతుపవనాలు బలపడి, వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.ఏమిటీ విధి విచిత్రమూ!

ధిక్కార కూటమి

ధిక్కరించిన ఎంపీలంతా కలిసి 'జాతీయ ప్రజా తంత్ర ధిక్కార అలయెన్స్ 'పెట్టుకున్నారు సార్!

Monday, July 21, 2008

అణుఒప్పందం మంచిదేనా?

దేశానికి మంచిదన్నాం కానీ... మాకు మంచిదన్నామా...?

Sunday, July 20, 2008

కొను 'గోల 'వ్యవహారం

నేను బేరమాడ్డానికి వస్తే నన్ను బేరమాడుతున్నాడు మేడం! మనం ఇవ్వజూపిన దానికన్నా రెండింతలు ఇస్తాడట.

చీకటి ఆంధ్రప్రదేశ్


ఓటు కోసం విందు


హత్యా?ఆత్మహత్యా?

నిజమే! లేకుంటే ఆ హత్యానేరం మనమీద పడుతుంది!!

Saturday, July 19, 2008

రాజకీయ బిక్షాటన

సందర్భం:
విశ్వాస పరిక్షలో ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో మన్మోహన్ ప్రభుత్వం చిన్నా చితకా పార్టీలకు మంత్రి పదవులు, నోట్ల కట్టలు ఆశ చూపి గేలం వేస్తుంది. మరొక వైపు యూపీఏ పార్టీలైన కాంగ్రెస్ నుంచి ఐదుగురు, సమాజ్‌వాది నుంచి 12 మంది, ఆర్‌జేడీ నుంచి ఐదుగురు ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది.

కరెంటు కటకట

టూ ఇన్ వన్ సార్! లైటు పోగానే దానంతట అదే లాంతరు వెలుగుతుంది.

కల్లు మైకంలో బాబు

వాసనకే ఇలా అయితే?!

కల్లు రుచి తెలిసింది


గాలిలో తేలుతున్న రాజశేఖరుడు


Friday, July 18, 2008

వరుణ యాగం

మేఘమధనం ప్రాజెక్టు వాళ్ళు వానల కోసం వరుణ యాగం చేస్తున్నారు సార్!

Thursday, July 17, 2008

ఓటరు నమోదు కార్యక్రమం

క్యూలో నించోవటం, ఫారం నింపటం, ఓటర్లిస్టులో పేరు సంపాదించటం, ఆనక ఏ తలమాసిన వాడికో ఓటేసి ఆనందించడం... ఏంటో కదూ!

అడిగిన వారికి కాదనకుండా!..


Wednesday, July 16, 2008

స్టాక్‌మార్కెట్‌లా దూసుకెళ్ళిన ఎంపీల ధర

మన ఎంపీలు లైన్లో ఉన్నర్సార్! ఆ 35కోట్ల విషయం కాస్త వివరంగా చెప్పమంటున్నారు!

గ్లామర్ బాటలో రాజకీయం

పెద్ద హీరోలెవరూ మనవైపు రాలేదు సార్.డూపుల్ని తెచ్చా! ఆయన చిరంజీవి డూప్,ఈయన బాలకృష్ణ డూప్,అతను మహేష్‌బాబు డూప్,ఈయన నాగార్జున డూప్...

మేఘమథనం


ఎంపీల వేలంపాట


Monday, July 14, 2008

పెరిగిన హొటల్ రేట్లు

ఆనక డబ్బు మిగులుతుందో లేదో నా టిప్పు ముందే ఇవ్వండి సార్!

సర్వే ఆంధ్రప్రదేశ్

బుద్దిగా ఉంటున్నావా?క్లాసుకి వెళ్తున్నావా?బాగా చదువుతున్నావా?అని రోజూ సతాయిస్తావే!అంతగా అనుమానం ఉంటే ఓ సర్వే చేయించుకో.

Saturday, July 12, 2008

వెబ్‌సైట్‌లో రహస్య ఒప్పందం

సందర్భం:
అణుఒప్పంద వివరాలు బయట పెట్టాలని వామపక్షాలు ప్రధానిని పదే పదే కోరాయి. కాని మన్మోహన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు ఇందన సంస్థ (ఐఏఈఏ)తో చర్చలు, ఒప్పంద విషయాలు రహస్యమని వీటిని బయట పెట్టడం కుదరదని తెగేసి చెప్పింది.వామపక్షాలు మద్దతు ఉపసంహరించాక భద్రత ప్రమాణాల ఒప్పందాన్ని విదేశీ వ్యవహారాల విభాగం వెబ్‌సైట్‌లో ఉంచారు.

వర్షాలు లేక రైతుల విలవిల

వరుణుడు మన పార్టీవాడేగా ఒకసారి గాంధిభవన్‌కి పిలిచి మాట్లాడండి సార్!

Friday, July 11, 2008

పాలేరు చంద్రన్న

చెప్పులు కుట్టారు,నాట్లేశారు,ఇస్త్రీ చేశారు,పాలు పితుకుతున్నారు! ఇన్ని విద్యలు నేర్చారు కాని,పార్టీ నుంచి వెళ్ళిపోయే నేతలను ఆపలేకపోతున్నారు!!...ప్చ్

ఆకాశాన్నంటిన ధరలు


మేజిక్ మాంత్రికుడు


మధ్యాహ్న భోజనం

ఆహారంపై పాఠం చెబుతుంటే ఆకలేస్తుందంటావే కూర్చో.మన దేశం ఆహారోత్పత్తిలో స్వయంసంవృద్ధి సాదించెను.ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో పంటలు పండినవి...రాసుకో!
సందర్భం:
పూర్తి స్థాయి బియ్యం సరఫరా లేకపోవడం వల్ల రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది.