నా బ్లాగులోని వ్యంగ్య చిత్రాలన్నీ వివిధ దినపత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.కార్టూన్లని ఇష్టపడేవాళ్ళ కోసం అన్నిటినీ ఒకేచోట చేర్చాలనే చిన్ని ప్రయత్నమే ఈ సేకరణలు.
కొత్తవాడు కదా,కొన్ని విషయాలు తెలియవు. శీనుగాడి చమక్కు: అన్ని విషయాలు తెలుసుకుని ముళ్ళ బాటలని కూడా పరుపులా చేసుకోవటానికి ఇంకా సమయం పడుతుంది,ఇప్పుడేగా వచ్చింది మరి!
మీరేం వర్రీ కాకండి!వీలయితే ఆయన పార్టీలో చేరి ఆయనకు చేదోడు వాదోడుగా ఉండమన్నా ఉంటాం సార్! శీనుగాడి చమక్కు: తమ్ముళ్ళూ! చంద్రన్న విమర్శించొద్దని చెప్పింది చిరు మీద అభిమానంతో కాదు,భయంతో!
ఇంకా నయం! పార్టీ ఏర్పాటు కోసం మరోసారి సభావేదిక ఏర్పాటు చేయాలేమోనని ఎంతగా బాధ పడ్డానో బావా. శీనుగాడి చమక్కు: పేరులో 'ప్రజ ' ఉండడం వలనేమో ప్రజలకిలాగే పార్టీకి కూడా అన్ని కష్టాలు.మొదట సభా ప్రాంగణం వివాదం,తర్వాత పార్టీ పేరు. ముందు ముందు ఇంకెన్నో!
టీడీపీ నుంచి వలసలకు గుర్తుగా పసుపు రంగు పెట్టడం బాగానే ఉంది బావా! శీనుగాడి చమక్కు: జెండాలో కాంగ్రెస్ రంగు కూడా ఉన్న విషయం 'సాక్షి ' గుర్తించలేదా! మరి దాని అర్థమేంటో కాంగ్రెస్ కే తెలియాలి.